Posted by : Unknown Wednesday, 15 July 2015

ఉత్తమ కులజుడు ఎవరు?
గాజుకుప్పే లోన కడగుచు దీపంబు అర్థము:గాజుకుప్పలో దీపం ఎలా ప్రకాశమాన౦ గాఉంటుందో అలాగే తెలి
యెట్టులుండు జ్ఞానమట్టులుండు వైన దివ్య పురుషులందు జ్ఞానం ఉంటుంది.
తెలిసినట్టి వారి దేహంబు లందుల
విశ్వధాభిరామ వినుర వేమ
సత్యమమరి యుండ జ్ఞాన మమరియుండు; అర్థము;సత్యము మాట్లాడేవాడు జ్ఞానము కలిగినవాడై ఉంటాడు.
జ్ఞానమమరి యుండ సత్యముండు జ్ఞానము కలిగినవాడు సత్యవంతుడు.సత్యము,జ్ఞానము రెండూ
జ్ఞానసత్యములును సమమైన ద్విజుడగు సమపాళ్ళలో ఉన్నవాడే “బ్రాహ్మణుడు”.అనగా ఉత్తమకులజుడు.
విశ్వదాభిరామ వినుర వేమ
అజ్ఞానము శూద్రత్వము అర్థము:జ్ఞానము లేనివాడు “శూద్రుడు”.సుజ్ఞానమే బ్రహ్మం.శ్రుతు
సుజ్ఞానము బ్రహ్మామట శ్రుతులను వినరా లను వినండి బ్రహ్మం గురించి తెలుసుకోండి.అజ్ఞానము
యజ్ఞాన ముడిగి వాల్మీకి విడిచి,బ్రహ్మజ్ఞానము పొందినాడు వాల్మీకి.
సుజ్ఞానపు బ్రహ్మమొందే జూడర వేమా
భయము సుమీ యజ్ఞానము అర్థము:అజ్ఞానము భయంకరమైనది.అటువంటి భయంపోతే
భయ ముడిగిన నిశ్చయంబు పరమార్థంబౌ అప్పుడు నిశ్చయంగా పరమార్థం గోచరిస్తుంది.భయాన్ని పోగొ
లయము సుమీ యీ దేహము ట్టుకుంటే అజ్ఞానము తొలగి జ్ఞానం కలుగుతుంది.జీవునకు
జయము సుమీ జీవుడనుచు జాటరా వేమ జయము కలుగుతుంది.
జనన మరణములకు నర్వి స్వతంత్రుడు గాడు అర్థము;జనన మరణాల్లో స్వతంత్రము లేదు.జననమరణాల
మొదల కరగాడు తుదనుగాడు మధ్య అన్నిటికి కర్తను నేనే అనుకోవటము నగుబాటు
నడమ కర్తననుట నగుబాటు కాదనుకో అదే అజ్ఞానము.
విశ్వదాభిరామ వినుర వేమ
దర్శనంబు లందు ధర షణ్మతములందు అర్థము;ఆరు శాస్త్రాలని,ఆరుమతాలని,వర్ణాశ్రమ ధర్మాలని విడ
వర్ణకాశ్రమముల వదల కెపుడు వక పాటించు వాడు గ్రుడ్డివాడు,అజ్ఞాని.
తిరుగుచుండువాడు ధరలోన నంధుండు
విశ్వధాభిరామ వినుర వేమ
జాతులందు మిగులజాతి యేదేక్కువో అర్థము;జాతుల్లో యేది గొప్పది.యేది తక్కువది అని తెలుసు
యెరుకలేక తిరుగనేమీ ఫలమొ కోవడానికి అక్కడా,ఇక్కడా తిరిగి తెలుసుకోవడము వల్ల
యెరుక గలగువాడే హెచ్చెన కులజుండు ప్రయోజనము లేదు.జ్ఞానము కలవాడే ఉత్తమ
విశ్వధాభిరామ వినుర వేమ కులజుడు.
పచ్చ విల్తుచేత గ్రచ్చర జనులెల్ల అర్థము:మన్మథుని ప్రభావానికి గురైన ప్రజలు కామానికి ప్రాధాన్యత నిచ్చి
తచ్చనాడ బడిరి ధరణిలోన, చిత్తం వచ్చినట్లు స్త్రీలతో ప్రవర్థీస్థూంటే వీరిలో ఉత్తమకులం వా
కులజిడెవ్వడిందు?గునహీనుడెవ్వడు? డెవరో?అధమకులం వాడెవడో ఏం తెలుస్తుంది?
విశ్వధాభిరామ వినుర వేమ
ఉత్తమ కులజుడు యెవరంటే జ్ఞానము కలవాడే అని అంటాడు వేమన.జ్ఞానము గాజుకుప్పెలో వెలుగుతున్న దీపము వంటిది.సత్యము పలుకుతూ,జ్ఞానము కలవాడిని,బ్రహ్మము తెలిసిన వాడిని బ్రాహ్మణుడు అని అంటారు.బ్రాహ్మణత్వము పుట్టుకతో రాదు. జ్ఞానమే అత్యంత అవసరమైనది. జ్ఞానము లేనివాడు శూద్రుడు.అజ్ఞానమును వీడి బ్రహ్మజ్ఞానమును తెలుసుకొని వాల్మీకి బ్రాహ్మణుడైనాడు. జననమరణాల మధ్య తాత్కాలిక జీవనము గడిపే మానవుడు శాస్త్రాలని,మతాలని,వర్ణాశ్రమాలని పాటించటము అజ్ఞానమే,అటువంటి వారు కనులుండి చూడలేని గ్రుడ్డివారితో సమానులు.ఎవరిది ఏ కులము,ఏ మతము,ఏజాతి అని తెలుసుకోవటానికి దేశమంతా తిరగక్కరలేదు .జ్ఞానము కలవాడే ఉత్తమకులజుడు. మన్మధుని కామ ప్రభావమునకు లోనైన మగరాయుడ్లు ఇష్టము వచ్చిన స్త్రీలతో కులుకుతూంటే పుట్టిన వారి కులము ఏదని నిర్ణ ఇస్తాము. ఎవ్వరిది ఉత్తమ కులము?ఎవ్వరిది అధమ కులము. అందుకే జ్ఞానము కలవాడే ఉత్తమ కులము వాడు.
సంకలనము చేసినవారు: ఆచార్య చిప్పగిరి జ్ఞానేశ్వర్,9440224383(పద్యము అర్థము కలిసి పోయాయి కొంచెము ఓపికగా చదవండి)

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

- Copyright © Valmiki Sevadal - Skyblue - Powered by Blogger - Designed by Johanes Djogan -